బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్.. 2019కిగాను ఆసియాలోనే అత్యంత సెక్సీయస్ట్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. గత పదేళ్లుగా ప్రజలను ఆకట్టుకుంటున్న కథానాయకుల్లో అగ్రగామిగా నిలిచాడు. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన 'ఈస్టర్న్ ఐ' వారంత దినపత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల నుంచి ఓటింగ్ పద్దతిలో తీసుకున్న అభిప్రాయాల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో హృతిక్ విపరీతమైన క్రేజ్ కలిగి ఉన్నాడని పేర్కొంది.
"నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రతివ్యక్తిలో ఆకర్షించేది అతడి జీవితం, ప్రయాణం.. జీవితంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కొన్న విధానం. నా పాత్రల కోసం ఒక నిర్దుష్ట దారిని ఎంచుకోవడం నేను చేస్తున్న పనిలో భాగం. ఇందుకు చాలా శ్రమ, కృషి అవసరం" -హృతిక్ రోషన్, సినీ నటుడు