Hrithik Roshan Saba marriage: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్-యువ హీరోయిన్ సబా ఆజాద్.. రిలేషన్షిప్లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి పలు రెస్టారెంట్, హోటళ్లలో కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ మధ్యకాలంలో హృతిక్ ఫ్యామిలీతో కలిసి కూడా సబా సరదాగా గడిపింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై స్పందించారు ఈ జంటకు సంబంధించిన ఓ కామన్ ఫ్రెండ్.
"హృతిక్, సబాలకు ఒకరిపై ఇంకొకరికి అభిమానం ఉంది. అతని కుటుంబసభ్యులకు కూడా ఆమె నచ్చింది. హృతిక్ ఇంటికి వెళ్లినప్పుడు పాటలు కూడా పాడింది. వారందరు బాగా ఎంజాయ్ చేశారు. సబా, హృతిక్ మాజీ భార్య సుసానేల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. సబా.. తాను రాసిన లిరిక్స్‌ను ససానేకు పంపి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. హృతిక్ పిల్లలకు కూడా ఆమెపై ప్రేమను చూపిస్తారు. మొత్తంగా హృతిక్, సబాలకు ఒకరిపై మరొకరి ప్రేమ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలనే తొందరపాటులో లేరు."