తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగులో హృతిక్​-వాణీ రొమాంటిక్​ సాంగ్​ - yashraj filims

బాలీవుడ్​ స్టార్​ హీరోలు హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన చిత్రం 'వార్​'. వాణీ కపూర్​ కథానాయిక. తెలుగులోనూ విడుదలకు సిద్ధమౌతోన్న ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల చేసింది చిత్రబృందం.

తెలుగులో హృతిక్​-వాణీ రొమాంటిక్​ సాంగ్​

By

Published : Sep 5, 2019, 2:05 PM IST

Updated : Sep 29, 2019, 12:58 PM IST

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం 'వార్'. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమౌతోన్న ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్​ సాంగ్​ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. 'గుండెలో తూట్లు పడే' అనే టైటిల్​తో సాగుతున్న పాటలో వాణీకపూర్​ ఫుల్​ గ్లామరస్​గా కనిపించింది.

హృతిక్​-వాణీ కపూర్​

హృతిక్, టైగర్‌ మధ్య వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగ్​ల కోసం దాదాపు 100 కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. బ్యాంగ్‌ బ్యాంగ్‌ సినిమా ఫేమ్​ సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. హిందీ సహా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

మరో ప్రాజెక్టు...

తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో హృతిక్​ సందడి చేయనున్నట్లు సమాచారం. అల్లు అరవింద్, నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్​ చిత్రం 'రామాయణం'లో... ఇతడు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడట. దంగల్‌ ఫేమ్​ నితిష్‌ తివారి, మామ్‌ ఫేమ్​ రవి ఉద్యావర్‌ కలిసి సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రామయణ ఇతిహాసాన్ని పూర్తి 3డీలో చూపించబోతోంది చిత్రబృందం. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో 3 భాగాలుగా దీన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలోని సీత పాత్ర కోసం నయనతారను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి...హిందీ ప్రేక్షకులు సాహో.. 100 కోట్లతో జయహో!

Last Updated : Sep 29, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details