డ్యాన్స్ పరంగా భారత్‌లోని ఎంతో మంది యువతకు హృతిక్ రోషన్ ఆదర్శం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నృత్యం నేర్చుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఇదే కోవకు చెందిన అభిమానే. అలాంటి హృతిక్‌ను ఓ చిన్నారి ఫిదా చేసింది. స్టెప్పులు ఇరగదీసి.. వహ్వా అనిపించుకుంది. గీత్ అనే బాలిక హృతిక్ నటించిన 'వార్' సినిమాలోని 'జై జై శివ్ శంకర్..' పాటకు డ్యాన్స్ చేసింది. దీన్ని అభిమానుల ఖాతా ద్వారా చూసిన హృతిక్ స్పందించారు. పాప డ్యాన్స్ వీడియోను రీట్వీట్ చేస్తూ.. 'వాట్ ఎ స్టార్.. లవ్‌యు' అని కామెంట్ చేశారు. ప్రస్తుతం గీత్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హృతిక్నే మెప్పించిన ఆ చిన్నారి డ్యాన్స్! - Hrithik Roshan latest news
ఓ చిన్నారి డ్యాన్స్ వీడియోకు ఫిదా అయిన హీరో హృతిక్ రోషన్.. 'వాట్ ఎ స్టార్ లవ్ యూ' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
హృతిక్ రోషన్
చిన్నారి ఏ మాత్రం తడబడకుండా అవలీలగా డ్యాన్స్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. దాదాపు 1.26 లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. హృతిక్ 'వార్'తో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.475 కోట్లు రాబట్టింది. దీని తర్వాత ఆయన 'క్రిష్' ఫ్రాంచైజీ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చదవండి: