తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎవరీ మైఖేల్​ జాక్సన్​.. కనుక్కొని​ చెప్పగలరా: హృతిక్​ - hrithik dance

బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​కు డాన్స్​ అంటే అమితమైన ఇష్టం. అందుకే అతడి సినిమాల్లోని పాటల్లో అద్భుతమైన స్టెప్పులు కనిపిస్తాయి. మరి అలాంటి స్టార్​ హీరోను ఓ వ్యక్తి తన డ్యాన్స్​తో మైమరపించాడు. అందుకే ఆ యువకుడు ఎవరు? అని ట్విట్టర్​ వేదికగా అభిమానులను అడిగాడు.

Hrithik Roshan Impressed over TikTok user's viral moves and asked fans for his Address
ఎవరీ మైఖేల్​ జాక్సన్​.. అడ్రస్​ చెప్పగలరా: హృతిక్​

By

Published : Jan 15, 2020, 10:46 AM IST

మైఖేల్‌ జాక్సన్‌ మూన్‌ వాక్‌... ప్రభుదేవా స్టైలిష్​ డాన్స్ చూస్తే ఎవరైనా 'వావ్​' అనాల్సిందే. ఆ తరహాలో డ్యాన్స్​ చేసేందుకు హీరోలూ చాలా కష్టపడతారు. బాలీవుడ్​ గ్రీక్​ గాడ్​ హృతిక్​ రోషన్​ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టెప్పులతో అభిమానుల మనసు దోచుకుంటాడు. మరి అలాంటి స్టార్​ హీరో ఓ యువకుడు చేసిన డ్యాన్స్​కు మైమరిచిపోయాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. అంతేకాకుండా "ఈ కుర్రాడెవరో చెప్పండి" అని అభిమానులను కోరాడు.

ఏమైందంటే..?

హృతిక్‌ రోషన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని టిక్‌టాక్‌ వీడియో తీసి ట్విటర్‌లో తన అభిమాన హీరో హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేశాడు. ఆ వీడియో చూసిన హృతిక్‌.. "నేను చూసిన గొప్ప ఎయిర్‌ వాకర్‌ డాన్సింగ్​ ఇదే.. ఎవరితను..?" అని స్వయంగా తన ఖాతా నుంచి ఆ అభిమాని పెట్టిన పోస్టును షేర్‌ చేశారు.

సినిమాలతో బిజీగా ఉండే హృతిక్‌ స్వయంగా ఓ అభిమాని వీడియోను షేర్‌ చేస్తూ.. అతని వివరాలు చెప్పమని అడగడం ట్విటర్‌ వేదికగా వైరల్‌ అయింది. హృతిక్‌ ఆ వీడియోను షేర్‌ చేయడం ఆ డ్యాన్స్‌ చేసిన కుర్రాడిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఓ అభిమాని వీడియోను హృతిక్‌ షేర్‌ చేయడాన్ని కూడా మెచ్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details