తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Hrithik Roshan: 'నా ఫొటోల వల్లే హృతిక్​కు హీరోగా ఛాన్స్​' - హృతిక్​ రోషన్​

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​కు(Hrithik Roshan) తొలిసారి సినిమా ఛాన్స్​.. తన వల్లే వచ్చిందని అన్నారు ప్రముఖ ఫొటోగ్రాఫర్​ డబూ రత్నానీ. ఈ విషయం హృతిక్​యే స్వయంగా తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. త్వరలోనే తన కొత్త క్యాలెండర్​ను విడుదల చేయనున్నారు.

hrithik roshan
హృతిక్​ రోషన్​

By

Published : Jun 24, 2021, 11:57 AM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​కు(Hrithik Roshan) తొలిసారి సినిమా అవకాశం తన వల్లే వచ్చిందని ప్రముఖ ఫ్యాషన్​ ఫొటోగ్రాఫర్​ డబూ రత్నానీ(Daboo Ratnani) అన్నారు. త్వరలో సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే 'డబూ రత్నాని 2021 క్యాలెండర్‌'ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డబూ ఈ విషయాన్ని వెల్లడించారు.

క్రిష్​

"'కహోనా ప్యార్​ హై' సినిమా ముందు నేను అతడి తొలి పోర్ట్​ఫోలియో షూట్​ చేశాను. నా వల్లే అతడికి సినిమా అవకాశం వచ్చింది. హృతిక్, ఈ విషయం నాతో చెప్పారు. అంతకుముందు అతడి నాన్న రాకేష్ రోషన్​ నాకు కాల్​ చేశారు. 'మీ ఫొటోలను చూశాను. నా కొడుకుతో సినిమా చేయాలనుకుంటున్నాను' అని నాతో అన్నారు. ఎప్పుడు ప్రజలతో నిజాయతీగా ఉండాలని చెప్పారు"

-డబూ రత్నానీ, ఫొటోగ్రాఫర్​

హృతిక్​ రోషన్​.. 2000లో 'కహోనా ప్యార్​ హై'(Kaho Naa pyar hai) సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు ఏకంగా 102 అవార్డులు వచ్చాయి. అన్ని పురస్కారాలు లభించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద అప్పట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పలు హిట్​ సినిమాలు చేశారు హృతిక్​. క్రిష్​ సిరీస్​.. సూపర్​హీరోగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. చివరిసారిగా సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వంలో 'వార్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చారు. మళ్లీ అదే దర్శకుడితో 'ఫైటర్'​ సినిమా చేయనున్నారు. 'క్రిష్​ 4' సినిమాను తెరకెక్కించనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు.

క్రిష్​

డబూ రత్నానీ ఓ ప్రముఖ ఫ్యాషన్​ ఫొటోగ్రాఫర్​. ప్రతి ఏటా సినీ ప్రముఖుల ఫొటోలతో ఓ క్యాలెండర్​ రూపొందించి, ప్రచురితం చేస్తుంటారు. ఈ ఏడాది.. ఆలియా భట్​, సన్నీలియోని, కియారా అడ్వాణీ, సైఫ్​ అలీఖాన్​ సహా పలువురు నటులతో ఫొటోషూట్​ చేశారు. ఇందులో విజయ దేవరకొండ కూడా ఉండటం విశేషం.

హృతిక్​ రోషన్​

ఇదీ చూడండి: ఒక్క సినిమాకు వందకు పైగా పురస్కారాలు!

ABOUT THE AUTHOR

...view details