తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విక్రమ్​ వేద'లో హృతిక్​ ఫస్ట్​లుక్​.. 'తీస్​మార్​ ఖాన్​' డబ్బింగ్ - పాయల్​ రాజ్​పుత్

Hrithik Roshan: కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న 'విక్రమ్ వేద' రీమేక్​, ఆది సాయి కుమార్-పాయల్​ రాజ్​పుత్ సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

hrithik roshan
విక్రమ్​ వేద

By

Published : Jan 9, 2022, 7:29 PM IST

Hrithik Roshan: బాలీవుడ్​లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రీమేక్​ చిత్రం 'విక్రమ్​ వేద'. హృతిక్​రోషన్​, సైఫ్​ ఆలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో 'వేద' పాత్ర పోషిస్తున్న హృతిక్ ఫస్ట్​లుక్​ను​ ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం (జనవరి 10) విడుదల చేయనున్నారు.

'విక్రమ్​ వేద' షూటింగ్​లో హృతిక్

తమిళ మాతృకను తెరకెక్కించిన పుష్కర్​, గాయత్రిలే(Pushkar–Gayathri) హిందీ రీమేక్​కు దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్​ అధికారికి (సైఫ్​ అలీఖాన్​) భార్యగా.. గ్యాంగ్​స్టర్​(హృతిక్​ రోషన్​)కు న్యాయవాదిగా రాధిక ఆప్టే కీలక పోషిస్తున్నారు. సినిమాను 2022 సెప్టెంబర్​ 30న విడుదల చేయనున్నారు.

'తీస్​మార్​ ఖాన్'​ డబ్బింగ్​..

డబ్బింగ్​ పనుల్లో ఆది

ఆది సాయికుమార్, పాయల్​ రాజ్​పుత్​ జంటగా నటిస్తున్న చిత్రం 'తీస్​మార్ ఖాన్'. ఈ సినిమా డబ్బింగ్​ పనులు మొదలుపెట్టారు ఆది.​ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

పాయల్

ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీస్​గా మూడు పాత్రల్లో ఆది నటించనున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతమందించగా, కల్యాణ్​జీ దర్శకత్వం వహించారు.

'డీజే టిల్లు' సాంగ్​ అప్డేట్.. జనవరి 10న

ఇదీ చూడండి:చైతూకు అన్నగా నటించడానికి కూడా రెడీ: నాగార్జున

ABOUT THE AUTHOR

...view details