నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. తన మాజీ భార్య సుస్సానే, ఇద్దరు కుమారులు ఇతడితో కలిసే ఉంటున్నారు. తాజాగా ఆ చిన్నారులతో కలిసి బాల్కనీలో హృతిక్ ముచ్చటిస్తున్న ఓ వీడియోను సుస్సానే ఇన్స్టాలో పంచుకుంది.
"ప్రస్తుత ప్రపంచంలో ఓ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఆస్వాదించడానికి మనకు సమయం లేదు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏమిటి ఈ జీవితం? కనీసం ఎక్కడికి పరుగెడుతున్నామో తెలీదు. " అంటూ రాసుకొచ్చింది సుస్సానే.