తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధనుష్​ మరో కొత్త చిత్రం.. 'ఫైటర్​'లో అనిల్ కపూర్ - Fighter

కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. వరుస చిత్రాలతో జోరుమీదున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త చిత్రం సహా హృతిక్​ రోషన్, కిచ్చా సుదీప్​ సినిమాల అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

dhanush
Fighter

By

Published : Dec 25, 2021, 9:26 AM IST

తమిళ కథానాయకుడు ధనుష్‌ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆయన నటించిన హిందీ చిత్రం 'అత్రాంగి రే' శుక్రవారమే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాగా.. 'ది గ్రే మ్యాన్‌'తో పాటు మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగులో వెంకీ అట్లూరితో 'సార్‌' అనే ద్విభాషా చిత్రం చేయనున్నారు. ఇప్పుడాయన జాబితాలో మరో సినిమా చేరింది. దర్శకుడు అరుణ్‌ మతేశ్వరన్​తో ధనుష్ ఓ చిత్రం చేయనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలు వాస్తవమేనని ధనుష్‌ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ధనుష్

"అవును.. ఊహాగానాలు నిజమే. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో చేస్తున్నాను. వివరాలు త్వరలో తెలియజేస్తాం" అని ధనుష్ ట్వీట్‌ చేశారు. "ఈ పెద్ద ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అంటూ దర్శకుడు అరుణ్‌ ట్విట్టర్​ ద్వారా స్పష్టత ఇచ్చారు.

Hrithik Roshan: 'ఫైటర్​'లో అనిల్ కపూర్

అనిల్ కపూర్​తో హృతిక్

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె కలయికలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ చిత్రం 'ఫైటర్‌'. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ నటించనున్నారు. సామాజిక మాధ్యమాల తమ చిత్రబృందంలోకి స్వాగతం పలికారు హృతిక్‌, దీపికా పదుకొణె. ఇండియాలోనే తొలి ఏరియల్‌ యాక్షన్‌ ఫ్రాంఛైజీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దీపిక

'విక్రాంత్​ రోణ' గ్లింప్స్..

కన్నడ స్టార్​ కిచ్చా సుదీప్​ పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోణ'. ఈ సినిమా గ్లింప్స్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో రిలీజ్​ కానుంది. అనూప్​ భండారి దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి:83 movie: 'నిజమైన దేశభక్తి అంటే ఏంటో '83'లో చూస్తారు'

ABOUT THE AUTHOR

...view details