*హృతిక్ రోషన్-దీపికా పదుకొణె జంటగా నటించేందుకు సిద్ధమయ్యారు. 'ఫైటర్' టైటిల్‌తో ఈ మూవీ ఫ్రాంచైజీని గురువారం ప్రకటన చేశారు. హృతిక్‌తో ఇప్పటికే 'వార్' తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మన త్రివిద దళాలకు సెల్యూట్ చేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరగనుంది. వచ్చే ఏడాది థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నారు.
*ఆర్య హీరోగా నటిస్తున్న 'సార్పట్ట'.. నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. బాక్సింగ్ ఆట నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. 'కబాలి', 'కాలా' ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.