మనదేశంలో ఇతిహాసాలకు కొదవలేదు. కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంతా సాధరణ విషయం ఏమీ కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుంటున్నారు. గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ కృష్ణుడిగా, ప్రముఖ నటి దీపిక పదుకొణె ద్రౌపదిగా నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
రామాయణ, మహాభారత చిత్రాలు నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే నితీష్ తివారి దర్శకత్వంలో రామాయాణాన్ని మూడు భాగాలు విభజించి సినిమాగా తీయాలని అనుకుంటున్నాడట. మహాభారతాన్ని కూడా రెండు భాగాలు తెరకిక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హిందీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.