హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. ఇప్పటికే కొంత భాగం మినహా దాదాపు చిత్రీకరణ పూర్తికావొస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హృతిక్‌తో నటిస్తుంటే డైలాగ్స్ మర్చిపోతున్నానని చెబుతున్నాడు టైగర్ ష్రాఫ్.
'హృతిక్‌తో నటిస్తుంటే డైలాగులు మర్చిపోతున్నా' - hrithik
హృతిక్‌తో కలిసి నటిస్తుంటే డైలాగులు మర్చిపోతున్నానని తెలిపాడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. తన అభిమాన కథానాయకుడితో తెర పంచుకోడాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు.
హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్లోని ఈథేన్ హంట్... బ్రిటీష్ గూఢచారి సినిమా జేమ్స్‌బాండ్ పాత్రలు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో తామిద్దరం (టైగర్, హృతిక్) నటిస్తే అలా ఉంటుందని చెప్పాడు టైగర్ ష్రాఫ్. తన అభిమాన కథానాయకుడితో కలిసి నటిస్తున్నానంటే నమ్మలేకపోతున్నాని చెప్పాడు.
ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు చిత్రబృందం. ప్రస్తుతం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 చిత్రంలో నటిస్తున్నాడు టైగర్. దీంతోపాటు హాలీవుడ్ చిత్రం రాంబో బాలీవుడ్ రీమేక్‌లోనూ నటించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు.