తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇలియానా పాత్రలో ఆయేషాను ఊహించగలమా..! - mahesh

పోకిరి చిత్రంలో హీరోయిన్​గా తొలుత బాలీవుడ్ నటి ఆయేషా టాకియాను అనుకున్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్. అయితే ఆమె తిరస్కరించిన కారణంగా ఆ సినిమాలో ఇలియానాను ఎంపిక చేశాడట పూరీ.

పోకిరి

By

Published : Nov 4, 2019, 5:31 AM IST

పోకిరి.. తెలుగు సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించిన చిత్రం. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్​హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో శృతి డైలాగ్​కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పాత్రలో అంతగా ఒదిగిపోయింది ఇల్లీ బేబీ. అయితే ముందు ఈ చిత్రంలో హీరోయిన్ ఇలియానా కాదంట.. ఆయేషా టాకియాను తీసుకోవాలనుకున్నాడట పూరీ.

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయేషా టాకియాకు పోకిరి ఆఫర్ వచ్చిందట. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాకు ఒప్పుకోలేదట. అప్పటికే దేవదాసు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఇలియానాను మహేశ్ సరసన నటించేందుకు ఎంపిక చేశాడట పూరీ. ఆ విధంగా ఆయేషా వదులుకున్న సినిమాతో గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్​గా మారిపోయింది.

అయితే బాలీవుడ్​లో పోకిరి రీమేక్​గా తెరకెక్కిన 'వాంటెడ్​'లో హీరోయిన్​గా నటించింది ఆయేషా. ఇందులో సల్మాన్​ ఖాన్​ సరసన జాన్వీ పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో ఆ సినిమా వదులుకున్న ఆమెకు హిందీలో అదే పాత్ర దక్కడం విశేషం.

ఇదీ చదవండి:దిల్లీలో సుమన్, రాజేంద్రప్రసాద్​లకు ఘన సత్కారం

ABOUT THE AUTHOR

...view details