కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పాత్రల్లో నటించిన నటీనటుల్ని మర్చిపోలేం. దర్శకుడు పరశురాం తెరకెక్కించిన 'గీత గోవిందం' చిత్రంలోని పాత్రలు, నాయకానాయికలు ఇంతే కదా..! ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా రష్మికకు యువత ఆకర్షితులయ్యారు. ఈ అవకాశం రష్మికకు రావడానికి రకుల్ ప్రీత్ సింగ్ కారణమని చెప్పొచ్చు. ఎందుకంటారా..?
'గీత గోవిందం'లో రకుల్ ఛాన్స్ అలా మిస్ - rakul preet sibng
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ సినిమాలో ముందుగా రకుల్‌ప్రీత్ సింగ్‌ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల రకుల్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పింది.
రకుల్
ముందుగా గీత పాత్ర కోసం దర్శక, నిర్మాతలు కథానాయిక రకుల్ ప్రీత్‌ను సంప్రదించారట. అప్పటికే ఆమె హిందీ చిత్రం 'దే దే ప్యార్ దే'లో నటిస్తుండటం వల్ల డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టును తిరస్కరించిందట. "ఎంత ప్రయత్నించినా.. 'గీత గోవిందం'లో నటించడం కుదరలేదు. ఈ అవకాశం కోల్పోయినందుకు బాధలేదు కానీ, నటించి ఉంటే బాగుండేది" అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రకుల్.
ఇవీ చూడండి.. 'ట్రైన్ జర్నీ చేస్తే కథలు బాగా రాస్తా'