తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్ బాలీవుడ్​ ఎంట్రీ.. ఈ హీరోయిన్లు పుట్టనేలేదు!

బాలీవుడ్​తో పాటు అక్షయ్​ సరసన చేస్తున్న పలువురు హీరోయిన్లు.. అతడు ఎంట్రీ ఇచ్చేనాటికి పుట్టనలేదు. ఇంతకీ ఆ భామలెవరంటే?

How old were Akshay Kumar's leading actresses when he made his Bollywood debut?
అక్షయ్ బాలీవుడ్​ ఎంట్రీ.. ఆ హీరోయిన్లు పుట్టనేలేదు!

By

Published : Dec 23, 2020, 9:10 AM IST

Updated : Dec 23, 2020, 11:06 AM IST

బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్.. ఏడాది నాలుగైదు సినిమాలు చేస్తూ అదరగొడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే హీరోయిన్లందరితోనూ ఆడిపాడుతుంటారు. ప్రస్తుతం ఆయనతో చేస్తున్న కొందరు భామలు.. అక్షయ్ సినీ ఎంట్రీ అప్పటికీ ఇంకా పుట్టనేలేదు. కొందరికి అయితే ఐదారేళ్లు ఉంటాయి. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరు? అక్షయ్​తో వారు ఏయే సినిమాలు చేశారు? చేస్తున్నారు?

1) సారా అలీఖాన్​

'అతిరంగీ రే' సినిమాలో అక్షయ్​​ సరసన సారా అలీఖాన్​ నటిస్తోంది. అయితే అతడి తొలి చిత్రం 'సౌగంధ్​' (1991) విడుదలయ్యేటప్పటికి సారా ఇంకా పుట్టలేదు. ఆమె 1995లో జన్మించింది.

సారా అలీఖాన్​, అక్షయ్​ కుమార్​

2) కియారా అడ్వాణీ

అక్షయ్​ కుమార్​ హారర్​-కామెడీ చిత్రం 'లక్ష్మి'.. ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో ఆయన భార్య పాత్రలో కియారా అడ్వాణీ నటించింది. ఇంతకు ముందు 'గుడ్​ న్యూస్​' చేశారు. అయితే ఈమె కూడా అక్షయ్​ బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చే సమయానికి పుట్టలేదు. 'సౌగంధ్​' విడుదలైన తర్వాత ఏడాది.. అంటే 1992లో కియారా జన్మించింది.

కియారా అడ్వాణీ, అక్షయ్​ కుమార్​

3) కృతి సనన్​

అక్షయ్​తో కలిసి కృతి సనన్​ 'హౌస్​ఫుల్​-4'లో నటించింది. ఈమెకు ఇప్పుడు 30 ఏళ్లు. అక్షయ్​ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి కృతి సనన్​కు ఏడాది. వీరిద్దరు 'బచ్చన్​ పాండే' కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు.

హౌస్​ఫుల్​ 4 చిత్రంలో అక్షయ్​ సరసన శ్రుతిహాసన్​

4) వాణీ కపూర్​

'బెల్​ బాటమ్​' కోసం తొలిసారి అక్షయ్​ కుమార్​, వాణీ కపూర్​ జంటగా నటిస్తున్నారు. 1991 నాటికి వాణీ కపూర్​కు కేవలం మూడేళ్లు.

బెల్​బాటమ్​ నటీనటుల బృందం

5) మౌనీ రాయ్​

'గోల్డ్​'లో(2018) అక్షయ్​ సరసన మౌనీ రాయ్​ హీరోయిన్​. అక్షయ్​​ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి మౌనీ వయసు ఆరేళ్లు.

అక్షయ్​ కుమార్​, మౌనీ రాయ్​

6) రాధిక ఆప్టే

'ప్యాడ్​మ్యాన్​'లో(2018) అక్షయ్​ కుమార్​ భార్యగా రాధిక ఆప్టే ఆకట్టుకుంది. అక్షయ్​ బాలీవుడ్​ ఎంట్రీ సమయానికి రాధికకు ఆరేళ్లు.

ప్యాడ్​మ్యాన్​లో రాధిక ఆప్టే, అక్షయ్​ కుమార్​

7) భూమి పెడ్నేకర్​

'టాయిలెట్​: ఏక్​ ప్రేమ్​ కథ'లో అక్షయ్​ కుమార్​ సరసన భూమి పెడ్నేకర్​ నటించింది. అక్షయ్​ బాలీవుడ్​లోకి వచ్చేటప్పటికీ భూమికి రెండేళ్లు.

భూమి పెడ్నేకర్​, అక్షయ్​ కుమార్​

8) అసిన్​

'ఖిలాడీ 786', 'హౌస్​ఫుల్​ 2' చిత్రాల్లో అక్షయ్​ కుమార్​, అసిన్​లు కలిసి నటించారు. 1991 నాటికి ఈమెకు ఐదేళ్లు.

అక్షయ్​ కుమార్​, ఆసిన్​

9) సోనాక్షి సిన్హా

అక్షయ్​​, సోనాక్షి సిన్హా కలిసి ఐదు చిత్రాల్లో నటించారు. 'రౌడీ రాఠోడ్​', 'మిషన్​ మంగళ్​', 'హాలీడే', 'జోకర్​', 'బాస్​' సినిమాల్లో వీరిద్దరూ కనువిందు చేశారు. అక్షయ్​ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి సోనాక్షికి మూడేళ్లు.

సోనాక్షి సిన్హా, అక్షయ్​ ుకమార్​

10) జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​

'హౌస్​ఫుల్​ 3', 'బ్రదర్స్​' చిత్రాల్లో అక్షయ్​ సరసన జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ కథానాయికగా చేసింది. అక్షయ్ బాలీవుడ్​ ఎంట్రీ నాటికి ఆమెకు ఐదేళ్లు.

జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​తో అక్షయ్​ కుమార్​

11) నిమ్రత్​ కౌర్​

అక్షయ్​ కుమార్​, నిమ్రత్​ కౌర్​ కలిసి నటించిన 'ఎయిర్​లిఫ్ట్​' విశేష ఆదరణ దక్కించుకుంది. అక్షయ్​ హీరో అయిన సమయానికి నిమ్రత్​ వయసు ఎనిమిదేళ్లు.

అక్షయ్​ కుమార్​, నిమ్రత్​ కౌర్​

12) తమన్నా

అక్షయ్ 'ఎంటర్​టైన్మెంట్​'(2014) చిత్రంతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది స్టార్​ హీరోయిన్​ తమన్నా. అక్షయ్​ బాలీవుడ్​లోకి అడుగుపెట్టిన సమయానికి తమన్నాకు ఏడాది వయసు మాత్రమే.

అక్షయ్​ కుమార్​, తమన్నా

13) అమీ జాక్సన్​

'సింగ్​ ఈజ్​ బ్లింగ్​' చిత్రంలో అక్షయ్​ కుమార్​ సరసన అమీ జాక్సన్​ నటించింది. శంకర్​ 'రోబో 2.0' కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు. అయితే అక్షయ్​​ సినిమాల్లోకి వచ్చిన సమాయానికి అమీ​ జన్మించలేదు. 1992 జనవరి 31న ఈమె​ పుట్టింది.

అమీ జాక్సన్, అక్షయ్​ కుమార్​

14) శ్రుతి హాసన్​

'గబ్బర్​' చిత్రంలో అక్షయ్​ కుమార్​, శ్రుతి హాసన్​ కలిసి నటించారు. అక్షయ్​ బాలీవుడ్​ ఎంట్రీ నాటికి శ్రుతి హాసన్​ వయసు ఐదేళ్లు.

శ్రుతి హాసన్​, అక్షయ్​ కుమార్​

15) ఇలియానా

అక్షయ్​ కుమార్​, ఇలియానా జంటగా నటించిన చిత్రం 'రుస్తుమ్'(2016). అయితే అక్షయ్​​ ఎంట్రీ నాటికి ఇలియానాకు ఐదేళ్లు.

ఇలియానా, అక్షయ్​ కుమార్​
Last Updated : Dec 23, 2020, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details