నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన వీరు వందల సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంతటి స్టార్ హీరోలు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఇంతకీ అవేంటంటే?
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ కలిసి 'పల్లెటూరి పిల్ల', 'సంసారం', 'రేచుక్క' (ఇందులో ఏయన్నార్‌ది అతిథి పాత్ర), 'పరివర్తన', 'మిస్సమ్మ', 'తెనాలి రామకృష్ణ', 'చరణదాసి', 'మాయాబజార్', 'భూకైలాస్', 'గుండమ్మ కథ', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం', 'భక్త రామదాసు' (ఇద్దరూ అతిథి పాత్రలు వేశారు), 'చాణక్య చంద్రగుప్త', 'రామకృష్ణులు', 'సత్యం శివం' చిత్రాల్లో నటించారు.
తన సినీ జీవితంలో 400 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి అభిమానులను మెప్పించారు. వీటిల్లో లవకుశ, దాన వీర శూర కర్ణ, చండ శాసనుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కలియుగ రాముడు, మహాపురుషుడు, కొండవీటి సింహం, అగ్గిరూపం, సర్దార్ రాయుడు, యుగంధర్, వేటగాడు.. వంటి హిట్ చిత్రాలు చేశారు.
70 ఏళ్లకు పైగా తన నటన జీవితంలో 250కి పైగా సినిమాల్లో నటించారు ఏఎన్ఆర్. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో గుర్తింపు పొందారు. ధర్మపత్ని, కీలుగుర్రం, పల్నాటి యుద్ధం, లైలా మజ్ను, ప్రేమ, బ్రతుకుదెరువు, దేవదాసు, దొంగ రాముడు, అనార్కలి, తోడి కోడళ్ళు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, మంచి మనసులు, కులగోత్రాలు, ప్రాణ మిత్రులు.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఇదీ చదవండి:'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'