తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' తగ్గేదే లే డైలాగ్​పై గరికపాటి ఆగ్రహం - allu arjun pushpa garikapati

Pushpa garikapati: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మగ్లర్​ను హీరోగా ఎలా చూపిస్తారని, తగ్గేదే లే అనే పదం వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

allu arjun
అల్లు అర్జున్

By

Published : Feb 3, 2022, 3:35 PM IST

Pushpa thaggede le garikapati: అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప'పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన ఆయనకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌ గరికపాటి దంపతులను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన 'పుష్ప'పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. స్మగ్లర్‌ను హీరోగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు.

ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు

"ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి.. చివరి ఐదు నిమిషాల్లో మంచి చూపిస్తాం, తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి 'తగ్గేదే లే' అంటాడా? ఇప్పుడు అదొక సూక్తి అయిపోయింది. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. 'తగ్గేదే లే' అంటున్నాడు. ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. 'తగ్గేదే లే' అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు' అంటూ గరికపాటి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details