తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కిక్ 2 సినిమాకు సాజిదే దర్శకుడు' - salman

కిక్ 2 సినిమాకు సాజిద్ నడియావాలానే దర్శకత్వం వహిస్తున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ నడియావాలా ప్రొడక్షన్ కంపెనీ తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించింది.

కిక్​ 2

By

Published : Jun 10, 2019, 5:15 PM IST

సల్మాన్ 'కిక్​ 2' చిత్రానికి సాజిద్ నడియావాలానే దర్శకత్వం వహించనున్నాడు. 'కిక్​' సీక్వెల్​గా వస్తున్న ఈ సినిమాను వేరే దర్శకుడు తెరకెక్కించనున్నాడని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసింది చిత్రాన్ని నిర్మిస్తున్న నడియావాలా గ్రాండ్​సన్​ ప్రొడక్షన్ కంపెనీ. ఈ విషయాన్ని ట్విట్టర్​లో తెలిపింది.

"కిక్​ 2 చిత్రంపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. సాజిద్ నడియావాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు" -నడియావాలా గ్రాండ్​సన్ ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్​.

'కిక్'​ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు సాజిద్. అయితే సీక్వెల్​ నుంచి సాజిద్ తప్పుకున్నాడని రోహిత్ శెట్టి తెరకెక్కించనున్నాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేశాయి. 2014లో వచ్చిన 'కిక్' చిత్రంలో సల్మాన్, రణ్​దీప్ హుడా, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రధానపాత్రల్లో నటించారు.

ఇది చూడండి: 'టోనీ' అవార్డు వేడుకల్లో వయ్యారుల హొయలు

ABOUT THE AUTHOR

...view details