మన టాలీవుడ్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకోసం విదేశీ సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటుంటారు. పలు దేశాలకు చెందిన స్టూడియోల్లో మన సినిమాలకు సంబంధించిన పనులు విరివిగా జరుగుతుంటాయి. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ స్థాయి మరింతగా పెరిగింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తున్నట్టు సమాచారం.
పవన్-క్రిష్ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్! - పవన్ సినిమాకు హాలీవుడ్ నిపుణులు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణల సహాయం తీసుకోనుంది చిత్రబృందం.
ఈ చిత్రం కోసం హాలీవుడ్ బృందం రంగంలోకి దిగబోతోంది. 'ఆక్వామెన్', 'వార్ క్రాఫ్ట్' తదితర చిత్రాలకు పనిచేసిన బెన్‌లాక్ నేతృత్వంలో పవన్ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ రూపొందనున్నాయి. పీరియాడికల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ భామ ఆడిపాడనున్నట్టు సమాచారం. ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుల్నే ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం క్రిష్.. వైష్ణవ్‌తేజ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తి కాగానే పవన్ సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్' పూర్తి చేయాల్సింది. ఈ నెలలోనే ఆ సినిమా చిత్రీకరణని పునః ప్రారంభించే అవకాశాలున్నాయి.