తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్ నిపుణులతో 'విరాటపర్వం' - Virataparwam movie updates

రానా హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'విరాటపర్వం'. ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు హాలీవుడ్​కు చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలిపింది చిత్రబృందం.

రానా
రానా

By

Published : Mar 10, 2020, 8:47 AM IST

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణను మొదలు పెట్టబోతున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

"ఈ సినిమాకు యాక్షన్‌ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ రిచెర్‌ ఈ చిత్రంలోని పోరాటాలకు రూపకల్పన చేశారు. ఆయన హిందీ చిత్రం 'ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌'లోని యాక్షన్‌ ఘట్టాల్ని తీర్చిదిద్దారు. అలాగే హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన డానీ సాంచెజ్‌ లోపెజ్‌ మా సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు" అని చిత్రవర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో ప్రియమణి, నందితాదాస్‌, ఈశ్వరీరావు, జరీనా వహాబ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details