ప్రముఖ అమెరికన్ కమెడియన్ బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో అతడు విగతజీవిగా కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అతడి మరణానికి కారణం డ్రగ్స్ లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. బాబ్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.