హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ 7'. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ మార్చి నుంచి నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్టు షూటింగ్‌ను సెప్టెంబరులో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇందులో నటిస్తున్న సైమన్ పెగ్ (బెంజీ డున్ పాత్రధారి).. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "చిత్రీకరణలో పాల్గొనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు సెట్‌కు వచ్చిన తర్వాత వైద్యపరీక్షలు చేయించాలి. మరీ వీటిని ఎలా చేస్తారో లేదో నాకైతే తెలియదు" అని వెల్లడించారు.