తెలంగాణ

telangana

కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి పారిపోయిన స్టార్ హీరో!

Russia Ukraine war star hero: ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్లిన ఓ స్టార్​ హీరో కాలినడకనే ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే సోషల్​మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకీ ఆయన ఎవరంటే...

By

Published : Mar 2, 2022, 1:54 PM IST

Published : Mar 2, 2022, 1:54 PM IST

Star Heroine in Ukraine
కాలినడక ఉక్రెయిన్‌ నుంచి పారిపోయిన స్టార్ హీరో

Russia Ukraine war star hero: ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తోన్న దండయాత్రను దృశ్య రూపంలో డాక్యుమెంటరీగా తీయాలని వెళ్లిన ఓ హాలీవుడ్‌ స్టార్‌కు విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరడం వల్ల ఉక్రెయిన్‌ విడిచి వెళ్లక తప్పని స్థితి.. దీంతో వేలాది మంది శరణార్థుల్లానే ఆయన కూడా కాలినడకనే దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది.

హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సీన్‌ పెన్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను డాక్యుమెంటరీగా చిత్రీకరించేందుకు ఇటీవల కీవ్‌ వెళ్లారు. గత గురువారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మీడియా సమావేశానికి కూడా హాజరై సంక్షోభ పరిస్థితులపై కొన్ని వీడియోలు కూడా రికార్డ్‌ చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. పెన్ ఉక్రెయిన్‌ నుంచి కాలినడక వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నటుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

భుజానికి బ్యాగు వేసుకుని, చేతిలో మరో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసిన సీన్‌ పెన్‌.. "మా కారును రోడ్డు పక్కన వదిలేసి నేను, నా ఇద్దరు కొలీగ్స్‌ మైళ్ల దూరం నడుచుకుంటూ పాలిష్‌(పోలాండ్‌) బోర్డర్‌కు చేరుకున్నాం. ఈ ఫొటోలో కన్పిస్తోన్న అన్ని కార్లలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. వారితో ఎలాంటి లగేజీ లేదు. కేవలం కారు మాత్రమే వారి వెంట ఉన్న ఏకైక ఆస్తి" అని రాసుకొచ్చారు.

హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సీన్‌ పెన్‌

అయితే తన కారును వదిలేసి నడుచుకుంటూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం పెన్ వెల్లడించలేదు. కాగా.. ఆయన ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా బయటపడినట్లు లాస్‌ ఏంజిల్స్‌లోని ఆయన అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు.. ఎందుకు ఉక్రెయిన్‌ను వీడారు అనే వివరాలు చెప్పేందుకు పెన్‌ సిబ్బంది నిరాకరించారు.

హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన సీన్‌ పెన్‌.. మిస్టిక్ రివర్‌, మిల్క్‌ సినిమాల్లో నటనకు గానూ ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ప్రజలను ఆదుకునేందుకు ముందుంటారు. 2010లో హైతీ భూకంపం, 2012 పాకిస్థాన్‌లో వరదల సమయంలోనూ బాధితులకు సాయం అందించారు. 2016లో మెక్సికన్‌ డ్రగ్‌ డీలర్‌ ఎల్‌ చాపోను రహస్యంగా ఇంటర్వ్యూ చేసి పెన్‌ వివాదాస్పద వార్తల్లో నిలిచారు.


ఇదీ చూడండి:బీచ్​లో తారల స్టన్నింగ్​ లుక్స్​!

ABOUT THE AUTHOR

...view details