తమిళనాడులో ప్రస్తుతం నీటి సమస్య ఎక్కువగా ఉంది. చెన్నై ప్రజలు నీరు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పలు విధాల సహాయం చేస్తున్న పరిష్కారం దొరకట్లేదు. దీనిపై హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో స్పందించాడు. ఇన్స్టాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టి బావి వద్ద నీరు తోడుతున్న మహిళల ఫొటోను జత చేశాడు. ఈ సమయంలో వర్షం మాత్రమే వారిని కాపాడగలదని అభిప్రాయపడ్డాడు.
చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో - తమిళనాడు నీటి సమస్య
తమిళనాడు నీటి సమస్యపై స్పందించిన హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో.. వర్షం మాత్రమే వారిని కాపాడగలదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో
"చెన్నైలో అత్యవరస పరిస్థితి ఏర్పడింది. పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా అందించే నీటి కోసం గంటల తరబడి ప్రజలు క్యూ లైన్‌లలో నిలబడాల్సి వస్తోంది. నీరు అందక హోటళ్లు, రెస్టారెంట్‌లు మూసేస్తున్నారు. మెట్రోలో ఏసీల వినియోగం ఆపేశారు" -లియొనార్డో డికాప్రియో, హాలీవుడ్ హీరో
ఇది చదవండి: చెన్నైలో నీళ్లు కావాలంటే టోకెన్ తీసుకోవాల్సిందే!