తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గ్లాడియేటర్'​ చిత్ర నిర్మాత కన్నుమూత - హాలీవుడ్​ సినిమా వార్తలు

అంతర్జాతీయంగా పేరు గడించిన 'గ్లాడియేటర్​' చిత్ర నిర్మాత బ్రాంకో లుస్టిక్ గురువారం కన్నుమూశారు. ఆయన మృతిపై హలీవుడ్​లోని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పించారు.

'గ్లాడియేటర్'​ చిత్ర నిర్మాత కన్నుమూత

By

Published : Nov 16, 2019, 4:04 PM IST

'గ్లాడియేటర్​' సినిమాతో గుర్తింపు పొందిన హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బ్రాంకో లుస్టిక్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. 1932లో పుట్టిన ఈయన.. 'ష్లిండర్స్​ లిస్ట్​' చిత్రంతో నిర్మాతగానే కాకుండా నటుడిగానూ నిరూపించుకున్నారు. బ్రాంకో మృతిపై హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పించారు.

బ్రాంకో చిన్న వయసులో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో బెర్గన్‌ బెల్సెన్‌ నిర్బంధ శిబిరాల్లో రెండు సంవత్సరాలు ఖైదీగా గడిపారు. ఆ అనుభవంతోనే 'ష్లిండర్స్‌ లిస్ట్‌' నిర్మించారు. మిమి లెడర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ది పీస్‌మేకర్‌'కు నిర్మాతగా వ్యవరించారు.

ఆ తర్వాత 'బ్లాక్‌ హాక్‌ డౌన్‌', 'కింగ్డమ్‌ ఆఫ్‌ హెవెన్‌', 'అమెరికన్‌ గ్యాంగ్సర్‌' లాంటి చిత్రాలకూ పని చేశారు.

ఇవి కూడా చదవడి: ఒకరిది రెట్రో లుక్.. మరొకరిది మోడ్రన్ స్టైల్

ABOUT THE AUTHOR

...view details