కరోనా ఎవరినీ వదలట్లేదు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరినీ భయపెడుతోంది. ఈ మధ్య కాలంలో టామ్ హ్యాంక్స్, ఓల్గా వంటి హలీవుడ్ నటులు ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పుడా జాబితాలోకి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేమ్ క్రిస్టోఫర్ హిజ్వు, ఇడ్రిస్ ఎల్బా చేరారు. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. నెటిజన్లకు జాగ్రత్తలు చెప్పారు.
క్రిస్టోఫర్ హిజ్వు
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేమ్ క్రిస్టోఫర్, తనకు కరోనా సోకిందని వైద్యులు నిర్ధరించినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. తన కుటుంబంతో పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పాడు.
ఇడ్రిస్ ఎల్బా
అవెంజర్స్ ఇన్ఫినిటీ ఫేమ్ ఇడ్రిస్ ఎల్బాకు కరోనా సోకింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఈ నటుడు.
టామ్ హ్యాంక్స్
కొన్నిరోజుల క్రితం హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్, అతడి భార్య రీటా విల్సన్‌కు కరోనా సోకింది. వీరు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిలో వారం రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా టామ్ డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతడి భార్య రీటా మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉంది.
టామ్ హ్యాంక్స్ అతని భార్య
ఓల్గా కురిలెంకో
జేమ్స్ బాండ్ నటి, ఉక్రెయిన్ మోడల్ ఓల్గా కురిలెంకో కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెటిజన్లకు జాగ్రత్తలు చెప్పింది. వైరస్ సోకినట్లు నిర్ధరణ అయినప్పటి నుంచీ ఇంట్లోనే ఉన్నానని, దాదాపు వారం నుంచి జ్వరం, అలసటతో ఇబ్బంది పడుతున్నానని రాసుకొచ్చింది.
2008లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా 'క్వాంటమ్ ఆఫ్ సోలేస్', 2013లో వచ్చిన 'ఒబ్లివియన్'లో నటించిందీ భామ
ఇదీ చూడండి : స్కూల్ యూనిఫామ్‌లో అల్లరి చేస్తున్న జాన్వీ కపూర్