తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్ 'వార్'కు హాలీవుడ్​ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యశ్ రాజ్ ఫిల్మ్స్

హృతిక్ రోషన్​ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వార్'. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్​ పనిచేయనున్నారు.

హృతిక్ 'వార్'కు హాలీవుడ్​ యాక్షన్ కొరియోగ్రాఫర్స్

By

Published : Jul 19, 2019, 10:31 PM IST

హృతిక్ రోషన్-టైగర్​ష్రాఫ్​ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్​ 'వార్'. వాణీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు అభిమానులకు ఆసక్తి రేపే మరో అంశాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్​లు పనిచేయనున్నారు. అక్టోబరు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

'వార్' సినిమాలో హృతిక్ రోషన్-టైగర్​ష్రాఫ్

పాల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్​హాస్, సీ యంగ్ హో హాలీవుడ్​కు చెందిన వారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్​ పర్వేజ్ షేక్​ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

"ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్​ను ఈ చిత్రం కోసం తీసుకున్నాం. విభిన్న పద్దతుల్లో ఫైట్స్​ తెరకెక్కించడంలో వీరు సిద్దహస్తులు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి యాక్షన్ సీక్వెన్స్.. రానున్న సినిమాలో ప్రేక్షకులు చూస్తారు." -సిద్దార్థ్ ఆనంద్, దర్శకుడు

హాలీవుడ్​లో 'ది డార్క్ నైట్', 'సాన్ ఆండ్రాస్', 'జాక్ రీచర్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాంటి యాక్షన్ చిత్రాలతో పేరుతెచ్చుకున్నాడు జెన్సింగ్స్. 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్','సేఫ్ హౌస్','డెత్ రేస్​' వంటి సినిమాలతో ప్రఖ్యాతి చెందాడు సీ యంగ్.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్​పై ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలోనూ విడుదల కానుందీ చిత్రం.

ఇది చదవండి: బాలీవుడ్​ కథానాయకుల మధ్య 'వార్'

ABOUT THE AUTHOR

...view details