తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa Elections 2021: 'మా'లో రాజకీయాలు.. ఈ విషయాలు మీకు తెలుసా? - maa elections president list

తెలుగు చిత్రసీమలో(Maa elections 2021) ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క విషయం 'మా' ఎన్నికలు(maa movie artist association). ఇండస్ట్రీతో మాత్రమే దీనికి కేవలం సంబంధం ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు కూడా 'మా' గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘం గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

maa elections
మా ఎలక్షన్స్​

By

Published : Oct 9, 2021, 9:18 AM IST

తెలుగు సినీ రంగంలో(maa elections 2021 schedule) నటీనటుల సంఘానిది 26 ఏళ్ల చరిత్ర. అందులో 20 ఏళ్ల చరిత్ర ఒక ఎత్తయితే(maa elections history).. గత ఆరేళ్లు మరో చరిత్ర. నటీనటులకు సంబంధించిన సమస్యలు, వివాదాల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 'మా' అసోసియేషన్​లో(maa movie artist assciation) అసలు లక్ష్యం పక్కదారి పట్టింది! వివాదాలకు నిలయంగా మారి యావత్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలిచింది. సామాన్య ప్రేక్షకుడూ 'మా' అసోసియేషన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠను సృష్టించింది. అసలు మా అసోసియేషన్ ఎలా ఏర్పాటైంది? దాని లక్ష్యాలేంటి? ఇంతకు ముందు అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఎలాంటి సేవలందించారు?

అలా ఏర్పడింది!

తెలుగు సినిమా నటీనటుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఏర్పాటు చేసింది(maa elections 2021 date) . వాస్తవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa elections new update) ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆకాశంలో అంకురించింది. పోలీసుశాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(maa elections chiranjeevi), మురళీమోహన్.. నటీనటుల సంఘంపై ఆలోచన చేశారు.

చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండగా తెలుగు చలన చిత్ర నటీనటులందరు అక్కడి దక్షిణాది ఆర్టిస్ట్ అసోసియేషన్​లో సభ్యులుగా ఉండేవాళ్లు. నటీనటులకు దర్శకులు, నిర్మాతల నుంచి ఏదైనా సమస్య వస్తే అక్కడి అసోసియేషన్​లో ఫిర్యాదు చేయాల్సి ఉండేది. సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చాక నటీనటులకు ఎలాంటి అసోసియేషన్ లేకపోవడం ఆలోచన రేకెత్తించింది. కేరళ నటీనటులు ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ) తరహాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​(మా) పేరుతో ఓ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని భావించారు. వెంటనే పెద్దలందరిని కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దల సమక్షంలో కళాకారులకు అమ్మలాంటి మా సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు(maa elections members). అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. రెండేళ్లు మురళీమోహన్ నివాసంలోనే 'మా' కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఫిల్మ్ నగర్​లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై మా అసోసియేషన్ కార్యాలయాన్నిలాంఛనంగా ప్రారంభించారు.

'మా' ఉద్దేశం ఇదే

నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉద్దేశం(maa association panel). నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషకం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా మా జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం అసోసియేషన్ బాధ్యత. ఈ బాధ్యతలను అసోసియేషన్​లోని కార్యవర్గ సభ్యులు చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి సభ్యుల సంక్షేమాన్ని చూసుకునేవారు.

తొలి అధ్యక్షుడిగా

మా అసోసియేషన్​కు మొదట వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి(maa elections president list) కొనసాగగా ఆ తర్వాత బాధ్యతలను మురళీమోహన్ స్వీకరించారు. ప్రతి రెండేళ్లకోసారి అసోసియేషన్ అధ్యక్షుడ్ని ఎన్నుకునేవారు. ఈ క్రమంలో మోహన్​బాబు, నాగార్జున, నాగబాబు.. 'మా' అసోసియేషన్​కు సేవలందించగా.. ఆరుసార్లు మురళీమోహన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత అసోసియేషన్ సభ్యుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికలకు దారితీశాయి. ఆరేళ్లపాటు వరుసగా జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో నటులు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నరేష్ అధ్యక్షులుగా పనిచేశారు.

అయితే గతంలోనూ అసోసియేషన్​కు ఎన్నిక జరిగినప్పటికీ అంతర్గతంగానే ఉండేది. మీడియా అటెన్షన్ లేకపోవడం వల్ల 'మా' ఎన్నికల హడావుడి పెద్దగా కనిపించలేదు. వరుసగా ఆరేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన మురళీమోహన్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటూ సహజనటి జయసుధను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల అసోసియేషన్​లో వర్గపోరు మొదలైంది. జయసుధపై పోటీకి రాజేంద్రప్రసాద్ నిలబడ్డారు. దీంతో 2015 నుంచి అసోసియేషన్​లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆ తర్వాత నరేష్- శివాజీరాజా పోటీపడగా సినీ పెద్దలు నరేష్​కు నచ్చజెప్పి శివాజీరాజాను ఎన్నుకున్నారు. శివాజీరాజా ఉన్నప్పుడు మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అనంతరం శివాజీరాజా టర్మ్ పూర్తి కావడం వల్ల 2019లో ఎన్నికలు జరిగాయి. శివాజీరాజా అక్రమాలకు పాల్పడ్డాడంటూ నరేష్, ఆ ఎన్నికల్లో పోటీకి దిగారు. మెగా బ్రదర్ నాగబాబు మద్దతుతో జీవిత రాజశేఖర్ లతో కలిసి పోటీ చేసి శివాజీరాజాపై గెలిచారు.

150 మంది సభ్యులతో ప్రారంభం

మా అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులుండేవారు(maa association members). పెద్ద నటీనటులకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా చిన్న చిన్న నటీనటుల కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవి. ఈ విషయాన్ని గ్రహించిన అసోసియేషన్.. నటీనటుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వెంటనే సహాయం చేసి ఆదుకునేది. ఆ తర్వాత సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించి ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. చిరంజీవి తోడల్లుడు కేవీ రావు ఆస్పత్రితోపాటు బసవతరాకం ఆస్పత్రిలోనూ ఉచితంగా చికిత్సలు చేయించేవారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​కు పరిమిత ఆదాయమంటూ లేకపోవడం వల్ల సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో విడుదలైన గాంధీ సినిమా మంచి వసూళ్లలో కొంత మొత్తాన్ని వెల్ఫేర్ ఫండ్​గా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డీని సభ్యుల వైద్య ఖర్చులకు అందించేవాళ్లు. అగ్రహీరోల సినిమాలకు బెన్​ఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బులను సభ్యుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టేవాళ్లు.

అంతేకాకుండా నటీనటులు వాళ్లు తీసుకునే పారితోషకాల్లోనూ కొంత మొత్తం అసోసియేషన్​కు విరాళంగా ఇచ్చేవాళ్లు. ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల.. నిరుపేద కళాకారుల వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల రూ.15 వేలు అసోసియేషన్​కు విరాళంగా పంపించేవారు. అలా దాతల విరాళాలు, వినోద కార్యక్రమాలతో పోగు చేసిన డబ్బును సభ్యుల కోసం ఖర్చు చేస్తుండేవారు. ఈ క్రమంలో అసోసియేషన్ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అసోసియేషన్ సభ్యత్వ రుసుము కూడా పెట్టారు. మొదట రూ.5 వేలు ఉన్న సభ్యత్వ రుసుము క్రమంగా రూ.10 వేలు ఆ తర్వాత రూ.లక్ష వరకు చేరింది.

ప్రస్తుతం మా లో 914 మంది శాశ్వత సభ్యులుండగా.. 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారిలో చనిపోయిన వారి సంఖ్య తీసివేస్తే 850 మంది మాత్రమే అసోసియేషన్ లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details