'ఆర్ఎక్స్100'తో ప్రేక్షకుల మన్ననలు పొందిన యువహీరో కార్తికేయ.. 'హిప్పీ'తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ప్లే బాయ్, బాక్సర్‌గా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడీ కథానాయకుడు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇద్దరు ముద్దుగుమ్మలతో ఓ తుంటరి కుర్రాడు సాగించిన ప్రేమాయణమే హిప్పీ కథ. ఆరు పలకల దేహంతో కార్తికేయ అలరిస్తుంటే, అందాలతో ఫిదా చేస్తున్నారు హీరోయిన్లు దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్. జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటించాడు.కళైపులి ఎస్.థాను నిర్మాత. టి.ఎన్ క్రిష్ణ దర్శకత్వం వహించాడు.