తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇద్దరు ముద్దుగుమ్మలతో ఓ బాక్సర్ ప్రేమగాథ - కలైపులి ఎస్. థాను

టాలీవుడ్ యువహీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హిప్పీ' ట్రైలర్ విడుదలైంది. విభిన్న లుక్​తో ఆకట్టుకుంటున్నాడీ కథానాయకుడు.

ఇద్దరు ముద్దుగుమ్మలతో ఓ బాక్సర్ ప్రేమగాథ

By

Published : May 9, 2019, 1:17 PM IST

'ఆర్.ఎక్స్.100' ఫేమ్​ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'హిప్పీ'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. దిగంగన సూర్యవంశీ హీరోయిన్​గా నటిస్తోంది. జె.డి.చక్రవర్తి, వెన్నెల కిశోర్ సహాయ పాత్రలు పోషిస్తున్నారు.

చిత్రంలో ప్రొఫెషనల్​ బాక్సర్​గా కనిపించనున్నాడు కథానాయకుడు. టీఎన్ కృష్ణ దర్శకుడు. కలైపులి ఎస్.థాను నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'హిప్పీ'.

ఇది కార్తికేయకు తొలి తమిళ చిత్రం కావడం విశేషం. 'గుణ 369' అనే మరో సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో.

ABOUT THE AUTHOR

...view details