Radheyshyam song update: ప్రభాస్, పూజాహెగ్డే నటిస్తున్న 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ నుంచి రెండో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను డిసెంబరు 8న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మూవీలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
Ramarao on duty movie release date: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్ల ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రవితేజ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
తొలి షెడ్యూల్ పూర్తి