తెలంగాణ

telangana

ETV Bharat / sitara

92 ఏళ్ల క్రితమే 191 ముద్దులు పెట్టించిన దర్శకుడు - లిప్​కిస్​

ఎక్కువ ముద్దులున్న చిత్రంగా 'డాన్​ జువాన్' సినిమా రికార్డు సృష్టించింది. 1926 ఆగస్టు 6న విడుదలైన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు 191 సార్లు ముద్దు పెట్టుకున్నారు. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వసూళ్ల సునామీ సృష్టించింది.

అత్యధిక ముద్దులు

By

Published : Nov 2, 2019, 7:44 PM IST

Updated : Nov 2, 2019, 8:56 PM IST

లిప్ కిస్​లు.. ఎక్కువగా ఉన్న చిత్రమేది? అని అడగ్గానే ఏ కొత్త చిత్రమో అయ్యుంటందని చాలా మంది అనుకుంటారు. కానీ 92 ఏళ్ల క్రితమే ఘాటైన అదరచుంబనాలున్నాయి ఓ సినిమాలో. అయితే అది తెలుగు చిత్రం కాదనుకోండి. 1926 ఆగస్టు 6న విడుదలైన హాలీవుడ్​ సినిమా 'డాన్ జువాన్' ఎక్కువ ముద్దులున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన ఎస్టెలీ టైలర్, మేరీ ఆస్టర్ 191 సార్లు ముద్దు పెట్టుకుంటారు. వీరిద్దరూ ఆ తరంలో అందాల తారలుగా పేరుగాంచారు. మూకీ చిత్రంగా విడుదలైన ఈ సినిమా అదిరిపోయే అదరచుంబనాలతో అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.

సినిమాకు మిశ్రమ ఫలితాలొచ్చినప్పటికీ కేవలం ఈ ముద్దు సీన్లతో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అలాన్ క్రాస్​లాండ్ దర్శకత్వం వహించాడు.

ఇదీ చదవండి: జయ బయోపిక్​లో శోభన్ బాబు కనిపిస్తారా..?

Last Updated : Nov 2, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details