ఆర్జీవీ 'మర్డర్' సినిమా విడుదలకు హైకోర్టు పర్మిషన్ - ramgopal varma news movie
![ఆర్జీవీ 'మర్డర్' సినిమా విడుదలకు హైకోర్టు పర్మిషన్ ఆర్జీవీ సినిమా 'మర్డర్' విడుదలకు హైకోర్టు పర్మిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9450184-876-9450184-1604644857678.jpg)
11:25 November 06
ఆర్జీవీ 'మర్డర్' సినిమా విడుదలకు హైకోర్టు అనుమతి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'మర్డర్' చిత్ర విడుదలకు అడ్డంకులు తొలిగాయి. అమృత కుటుంబ సభ్యులు నల్గొండ కోర్టును ఆశ్రయించగా... సదరు న్యాయస్థానం చిత్ర విడుదలపై స్టే ఇచ్చింది. నల్గొండ కోర్టు తీర్పును సవాలు చేస్తూ... చిత్ర బృందం హైకోర్టులో కేసు దాఖలు చేసింది.
విచారించిన ఉన్నత న్యాయస్థానం... 'మర్డర్' సినిమా విడుదలకు అనుమతించింది. నల్గొండ కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. అయితే... సినిమాలో మాత్రం వాస్తవ పేర్లను చిత్రంలో వాడొద్దని చిత్ర బృందానికి హైకోర్టు షరతు పెట్టింది.
ఇదీ చూడండి: తిరిగి సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప'