తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ కొత్త సినిమా గ్రాఫిక్స్​కు భారీ బడ్జెట్!

డార్లింగ్ ప్రభాస్, త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇందులోని గ్రాఫిక్స్​ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారని సమాచారం.

ప్రభాస్
ప్రభాస్

By

Published : Mar 20, 2020, 4:06 PM IST

'బాహుబలి', 'సాహో' సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్‌. ప్రస్తుతం 'జాన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీని తర్వాత దర్శకుడు నాగ్​ అశ్విన్​తో కలిసి పనిచేయనున్నాడు.

సైన్స్ ఫిక్షన్ కథతో తీయబోయే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరలో షూటింగ్ మొదలు కానుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది. ఈ కథలో ఎంతో ప్రాధాన్యమున్న గ్రాఫిక్స్‌ కోసమే దాదాపు రూ.50కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట.

ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి వీటిలో నిజాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

ABOUT THE AUTHOR

...view details