తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఖతర్నాక్​ పాత్రతో ముమైత్​ఖాన్ రీఎంట్రీ - మున్నాకాశీ

నటి ముమైత్​ఖాన్.. దెయ్యం పాత్రలో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. 'హెజా' టైటిల్​తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.

సరికొత్త పాత్రతో ముమైత్​ఖాన్ రీఎంట్రీ

By

Published : Jul 6, 2019, 5:06 PM IST

ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి ముమైత్​ఖాన్. 'హెజా' అనే హారర్ చిత్రంతో టాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇస్తోంది. 'యాక్షన్ త్రీడీ', 'చందమామ కథలు' చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ.. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ సంగీత దర్శకుడు, దర్శకుడిగా పనిచేస్తున్నాడు. నూతన్ నాయుడు, ప్రీతం నిగమ్ ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ చివరిదశలో ఉంది.

హెజా సినిమా పోస్టర్

"ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంగీతమందించాను. తొలిసారి హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్​ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది." -మున్నా కాశీ, దర్శకుడు, హీరో

ఇది చదవండి: చిందేసిన 'ఓ బేబీ' చిత్రబృందం

ABOUT THE AUTHOR

...view details