తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాంటిక్ పాటతో అదరగొట్టిన నాగ్ - వెన్నెల కిశోర్

నాగార్జున నటించిన 'మన్మథుడు-2'లోని 'హే మేనినా' అంటూ సాగే తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

రొమాంటిక్ పాటతో అదరగొట్టిన నాగ్

By

Published : Jul 21, 2019, 8:21 PM IST

టాలీవుడ్​ కింగ్ నాగార్జున.. త్వరలో 'మన్మథుడు-2' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. 'హే మేనినా..' అంటూ సాగే తొలిపాటను ఆదివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్​​ లుక్​తో ఆకట్టుకుంటున్నాడు అక్కినేని హీరో. ఆగస్టు 9 నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా.

రకుల్ ప్రీత్ సింగ్​ హీరోయిన్​గా నటించింది. సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. 'చి.ల.సౌ'తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్​ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. జులై 25న ట్రైలర్​ రిలీజ్​ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్​, మనం ఎంటర్​ప్రైజెస్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది.

ఇది చదవండి: 'మన్మథుడు 2'లో ధూమపానంతో రకుల్​ రచ్చ

ABOUT THE AUTHOR

...view details