'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఇందులోని తొలి పాట ఇప్పటికే ఆదరణ దక్కించుకోగా, 'హే ఇది నేనేనా' అంటూ సాగే రెండో పాటను బుధవారం విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన గీతానికి తమన్ స్వరాలను సమకూర్చారు.
అమృత కోసం సోలో లైఫ్‌కు విరాట్ ఫుల్స్టాప్
సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలోని రెండో పాట విడుదలైంది. 'హే ఇది నేనేనా' అంటూ సాగే లిరిక్స్ శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.
అమృత కోసం సోలో లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టిన విరాట్!
ఈ సినిమాలో నభా నటేష్ కథానాయిక. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా త్వరలో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.