తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​బాబు చాలా క్యూట్​ అంటున్న రష్మిక - cinema vaarthalu

'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి 'హీ ఈజ్ సో క్యూట్​' అనే లిరికల్ గీతం సోమవారం విడుదలైంది. ఇందులో మహేశ్​ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది.

మహేశ్​బాబు చాలా క్యూట్​ అంటున్న రష్మిక
మహేశ్​బాబు-రష్మిక

By

Published : Dec 16, 2019, 5:06 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి మరో పాట వచ్చింది. ఇందులో 'హీ ఈజ్ సో క్యూట్​' అంటూ మహేశ్​పై పాట పాడేస్తోంది హీరోయిన్ రష్మిక. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇందులో మహేశ్​.. మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నాడు. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజ్, అనిల్ సుంకర, మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: 'సరిలేరు నీకెవ్వరు' పాటకు రష్మిక అదిరిపోయే స్టెప్పులు

ABOUT THE AUTHOR

...view details