బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన బీటౌన్ కథానాయికలు తమ సోషల్ మీడియా ఖాతాలకు గుడ్‌బై చెప్పడం, కామెంట్ సెక్షన్లను పరిమితం చేయడం లేదా క్లోజ్ చేయడం చేస్తున్నారు. మరి ఇంతకి ఆ కథానాయికలు ఎవరో తెలుసుకుందాం.
సోనమ్ కపూర్
ఒకానొక సమయంలో తన తండ్రితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్.. తనకు సుశాంత్ ఎవరో తెలియదని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్లపై స్పందించిన సోనమ్.. ఇన్‌స్టా వేదికగా ఆ ట్వీట్లను షేర్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి నెటిజన్లు సోనమ్‌పై విరుచుకుపడ్డారు. "మీ తండ్రి అనిల్ కపూర్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి", "మీ తండ్రి కష్టపడటం వల్ల మీరు ఈ స్థితిలో ఉన్నారు" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫలితంగా తన కామెంట్ సెక్షన్‌ను పరిమితం చేసుకున్నారు సోనమ్.
సోనాక్షి సిన్హా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్ల తాకిడి తట్టుకోలేక ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ప్రస్తుత రోజుల్లో ట్విట్టర్లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని.. ప్రతికూల భావనలకు దూరంగా ఉన్నప్పుడే అందమైన జీవితాన్ని కాపాడుకోగలమని తెలిపారు.