తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మళ్లీ రావా' అంటున్న సినీ అభిమానులు - anshu

ఒకటి.. రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు పొంది... అనంతరం సినీ ఇండస్ట్రీకి దూరమైన నటీమణులు మళ్లీ తెరపై కనిపించాలని సగటు సినీ అభిమాని ఆకాంక్ష. వారిపై ఓ లుక్కేద్దాం.

సినిమా

By

Published : Sep 9, 2019, 6:31 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

సినిమా కథానాయికలు.. ఒకప్పడు ఏళ్ల తరబడి సినిమాలు చేసే వాళ్లు. క్రమేణా నటన కంటే అందానికే ప్రాముఖ్యత పెరిగి వారి సినీ కెరీర్​కు శుభం కార్డు పడిపోతోంది. ప్రస్తుతం ఒకటి, రెండు చిత్రాలకే పరిమితమైన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. ఇలా కొన్ని విజయవంతమైన సినిమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోయిన కొంతమంది కథానాయికల గురించి ఇప్పుడు చూద్దాం!

గీతాంజలి ఎక్కడ ?

అక్కినేని నాగార్జున కెరీర్​లో మరపురాని చిత్రం'గీతాంజలి'. అందులో హీరోయిన్​గా నటించిన 'గిరిజ' తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు మరచిపోని కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ నటి ఒక్క సినిమాతోనే ఆగిపోయింది. అనంతరం అడపాదడపా కనిపించినా.. అంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్​లో ఉంటున్న ఈమె జర్నలిస్ట్​గా పనిచేస్తోంది.

గిరిజ

'మన్మథుడు'తో మదిని దోచిన అన్షు

2003లో వచ్చిన 'మన్మథుడు' చిత్రంలో నాగార్జున సరసన నటించింది అన్షు. ఈ సినిమాలో అందం, అమాయకత్వంతో కూడిన ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రభాస్​ నటించిన 'రాఘవేంద్ర' చిత్రంలో చివరిసారిగా కనిపించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పెళ్లి చేసుకుని లండన్​లో సెటిలయింది మన మహేశ్వరి.

అన్షు

సఖి ఫేమ్ షాలిని

'చెలియా...సఖియా' అంటూ యువకులకు గిలిగింతలు పెట్టింది షాలిని. 2000 సంవత్సరంలో వచ్చిన 'సఖి' చిత్రంలో నటనతో మెప్పించింది. బాలనటిగా చాలా చిత్రాల్లో కనిపించినా.. కథానాయికగా కొన్ని సినిమాల్లోనే నటించింది. తెలుగులో 'సఖి' చిత్రంతో ప్రాచుర్యం పొందిన శాలిని తమిళ నటుడు అజిత్​ని ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.

షాలిని

తొలిప్రేమతో కవ్వించిన కీర్తి

పవన్ ​కల్యాణ్ కెరీర్​లో మైలురాయి లాంటి చిత్రం 'తొలిప్రేమ'. ఆ సినిమాలో కథానాయికగా నటించిన కీర్తిరెడ్డి.... 'అను' పాత్రలో మైమరిపించింది. అనంతరం కొన్ని సినిమాలు చేసిన ఈ భామ 2004లో మహేశ్​బాబు 'అర్జున్'​ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. 2006లో హీరో సుమంత్​ని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకే విడిపోయి అమెరికా వెళ్లిపోయింది.

కీర్తి రెడ్డి

వీళ్లే కాకుండా గజాల, అదితి అగర్వాల్, షామిలీ లాంటి హీరోయిన్లు.. ఒకటి రెండు చిత్రాలతో మంచి గుర్తింపు పొంది... అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పటికీ వీరి సినిమాలు చూసేటప్పుడు మళ్లీ ఓ సారి తెరపై కనిపిస్తే బాగుండు అనుకుంటారు సగటు సినీ అభిమానులు.

ఇవీ చూడండి.. 'బయోపిక్'​లలో ఈ చిత్రాలు వేరయా..!

Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details