తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డైలాగ్‌ కొట్టారు...గుర్తుండిపోయారు..! - sai pallavi

కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఉద్దేశిస్తూ చెప్పే డైలాగ్స్​ సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి. కథానాయికలు వారి క్యారెక్టర్​ను తెలియపరుస్తూ చెప్పే ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఏ హీరోయిన్ ఏ చిత్రంలో ఏ డైలాగ్​తో అలరించిందో చూద్దాం.

సినిమా

By

Published : Nov 25, 2019, 5:48 AM IST

కొంచెం ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి’ : చిరంజీవి
మేడమ్‌.. మేడమ్‌.. సారీ మేడమ్‌ : విజయ్‌ దేవరకొండ

'ఘరానా మొగుడు' చిత్రంలో చిరు.. ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి అనడం, 'గీత గోవిందం' సినిమాలో విజయ్‌ సారీ మేడమ్‌ అని చెప్పడం.. ఈ చిత్రాలకే ప్రత్యేకం. ఈ రెండు మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో ఇలాంటి క్యాచీ పదాలు ఉన్నాయి. నాయకాప్రతినాయకుల మధ్య జరిగే మాటల యుద్ధం ప్రేక్షకులతో విజిల్‌ కొట్టిస్తే, ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్‌ చప్పట్లు కొట్టిస్తాయి. మళ్లీ అలాంటి సన్నివేశం ఎప్పుడొస్తుందా అనిపించేలా చేస్తాయి. అయితే ఇవి కథానుసారం వినిపించడం వల్లే ప్రేక్షకులు అంతగా ఆస్వాదించారు. కావాలని అతికించినట్లు కాకుండా కథానాయకుడి స్వభావం ఒక్క మాటతోనే తెలియజేసేలా ఉంటాయి. ఈ కోవలో వచ్చిన చాలా చిత్రాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. ఇవి హీరోలకే పరిమితమా? అంటే కాదు అనాల్సిందే. ఇప్పటికే ఎందరో కథానాయికలు వాళ్లు ఏ పాత్ర పోషించారో ఒక్క మాటలోనే చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు కథానాయిక తనేంటో పదే పదే ప్రస్తావిస్తుంటుంది. రెండు సార్లు ఆమె మాయలో పడిన ప్రేక్షకుడు మూడోసారి ఆమెతోపాటు గొంతు కలుపుతాడు. ఇటీవలే విడుదలైన కొన్ని చిత్రాల్లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏ కథానాయిక ఏ చిత్రంలో ఏ డైలాగ్‌తో అలరించిందో చూసేద్దాం...

అంజలి: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

ఈ చిత్రంలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది అంజలి. కల్మషంలేని అమ్మాయిగా సహజమైన నటనతో అందరి హృదయాల్ని దోచుకుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే సీతను నీకెలా తెలుసు అంటే? "ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..." అని చెప్పి ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మెహరీన్‌: 'ఎఫ్‌ 2'

'ఎఫ్‌ 2' చిత్రంలో హనీ పాత్రలో నటించింది మెహరీన్‌. ఆ క్యారెక్టర్​ను హైలెట్‌ చేసేందుకు "హనీ ఈజ్‌ ద బెస్ట్‌" అని ఎన్ని సార్లు చెప్పిందో. ఈ సినిమాలో "హనీ ఈజ్‌ ద బెస్ట్‌" అని పాట కూడా పాడించుకుంది.

సాయి పల్లవి: 'ఫిదా'

'ఫిదా' చిత్రంలో భానుమతిగా కనిపించి యువతను ఫిదా చేసింది. "భానుమతి ఒక్కటే పీస్‌" ఈ ఒక్క డైలాగ్‌తో పల్లవి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో రెండు కులాలు, రెండు మతాలు హైబ్రిడ్‌ పిల్ల అంటూ చెప్పడం వల్ల ఆ పాత్ర ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది.

సాయి పల్లవి

రెజీనా: 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌'

'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌'లో సీతగా కనిపించింది రెజీనా. సీత అంత తొందరగా ఎవరినీ నమ్మదు. ఆమెను మోసం చేయడం అంత తేలిక కాదు. ఇలాంటి పాత్ర గురించి ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేయాలంటే "సీతతో అంత ఈజీ కాదు" అనే మాట చెప్పాల్సిందే. ఆ డైలాగే చెప్పి సీత పాత్రలో ఒదిగిపోయింది రెజీనా.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌: 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'

రకుల్‌ 'వెంకటాద్రి' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రార్థన అనే పాత్రలో తొలి సినిమాతోనే మెప్పించింది. ఇందులో ఆమెది డబ్బు ఖర్చు చేసేందుకు ఇష్టపడని అమ్మాయి పాత్ర. అందుకే "ప్రార్థన ఇక్కడ.. ప్రతిదీ కౌంట్‌" అంటూ ఆకట్టుకుంది.

రకుల్ ప్రీత్

తమన్నా: '100 పర్సంట్‌ లవ్‌'

ఈ సినిమాలో మహాలక్ష్మిగా దర్శనమిచ్చింది తమన్నా భాటియా. పల్లెటూరి అమ్మాయిగా నగరానికి వచ్చి బావ మీద కోపం, ప్రేమతో బాగా చదువుకుని తానేంటో నిరూపించే వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది. అనుకున్నది సాధించి అందరితో 'దటీజ్‌ మహాలక్ష్మి' అనిపించుకుంది.

తమన్నా

ఇవీ చూడండి.. మ్యూజియంలో విజయ్ 'బొమ్మ' అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details