తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాళ్లకు ఛాన్స్ మిస్.. ఈ హీరోయిన్స్​కు జాక్​పాట్! - విజయ్ దేవరకొండ రష్మిక గీతగోవిందం

ప్రముఖ హీరోయిన్లు.. కొన్నిసార్లు మంచి మంచి సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. తెలుగులోనూ ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? మరి జాక్​పాట్ కొట్టిన కథానాయికలు ఎవరు? అనేదే ఈ స్పెషల్ స్టోరీ

rashmika kajal samantha
రష్మిక కాజల్ సమంత

By

Published : Jan 2, 2022, 6:41 PM IST

'అరే ఈ సినిమా మా హీరో చేయాల్సింది రా. జస్ట్ మిస్. మీ హీరో చేసి హిట్​ కొట్టాడు గానీ.. అదే మా వాడు చేసుంటేనా.. సినిమా బ్లాక్​బస్టర్ అయ్యేది'.. ఇద్దరు తెలుగు సినిమా అభిమానుల మధ్య ఇలాంటి డిస్కషన్స్ జరగడం సర్వసాధారణం.

అయితే అలా ఓ హీరో.. సినిమా వదులుకోవడానికి, మరో హీరో ఆ సినిమా చేయడానికి కారణాలు ఏమైనా సరే.. ఇలాంటి సంఘటనలు టాలీవుడ్​లో చాలానే జరిగాయి. ఇది హీరోలకు మాత్రమేనా అంటే అస్సలు కాదు. హీరోయిన్లు కూడా చాలాసార్లు మంచి మంచి సినిమాల్లో డేట్లు సర్దుబాటు కాక, మరే ఇతర కారణాల వల్లనో ఆయా చిత్రాల్ని వదులుకున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి. అలా కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయిన హీరోయిన్స్ ఎవరు? ఆ సినిమాలేంటి తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

మహానటి: దిగ్గజ నటి సావిత్రి బయోపిక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో తొలుత టైటిల్​ రోల్ కోసం నిత్యామేనన్​ను అనుకున్నారు. కానీ ఆ పాత్ర కీర్తి సురేశ్​ను వరించింది. సావిత్రి ఇలానే ఉంటుందా అనేంతలా అద్భుతంగా నటించిన కీర్తి.. నటిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.

మహానటి సినిమాలో కీర్తి సురేశ్

రంగస్థలం: ఈ సినిమాలో రామ్​చరణ్ పక్కన తొలుత అనుపమ పరమేశ్వరన్​ను హీరోయిన్​గా అనుకున్నారు. కానీ చివరకు సమంత ఫైనల్ అయింది.

రెబల్-నారప్ప-కొచ్చాడియన్: ఈ మూడు సినిమాల్లోనూ తొలుత హీరోయిన్​గా అనుష్క శెట్టినే అనుకున్నారు. కానీ ఏమైందో ఏమోగానీ వీటిలో ఆమె నటించలేదు. ఆ తర్వాత తమన్నా-రెబల్, నారప్ప-ప్రియమణి, దీపికా పదుకొణె-కొచ్చాడియన్.. ఆ సినిమాల్లో నటించారు.

చెలియా: నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని ఈ సినిమా కోసం హీరోయిన్​గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అదితీ రావ్ హైదరీకి ఆ ఛాన్స్ దక్కింది.

చెలియా సినిమాలో అదితీ

గీతగోవిందం: రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిన్న సినిమా.. విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మికకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఇందులో హీరోయిన్​గా తొలుత రకుల్ ప్రీత్ సింగ్​ను అనుకున్నారు. కానీ అది వర్కౌట్​ కాలేదు.

రష్మిక

బిజినెస్​మేన్: మహేశ్​బాబు-పూరీ జగన్నాథ్ కాంబినేషన్​లో వచ్చిన మాస్ ఎంటర్​టైనర్​లో హీరోయిన్​గా తొలుత శ్రుతిహాసన్​ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాజల్​ అగర్వాల్ కథానాయికగా చేసింది.

అలానే వరుణ్​తేజ్ 'గని'లో కియారా అడ్వాణీకి బదులు సయీ మంజ్రేకర్, 'రాజుగారి గది 3'లో తమన్నాకు బదులు అవికా గోర్, హిందీ 'జెర్సీ'లో రకుల్ బదులు మృణాల్ ఠాకుర్, 'మాస్ట్రో'లో పూజా హెగ్డే బదులు నభా నటేశ్, నాని 'జెంటిల్మన్​'లో నిత్యామేనన్​కు బదులు సురభి, 'అమర్ అక్బర్ ఆంటోని'లో అను ఇమ్యాన్యుయేల్​కు బదులు ఇలియానా హీరోయిన్లుగా చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details