ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న నటీమణులు.. అందమైన రూపంతో, మచ్చలేని చర్మంతో మెరిసిపోతుంటారు. ఇలాంటి అందాన్ని సాధించటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీ బాటల్లో కొంత మంది తారలు వెళుతున్నారు. నటిగా అవకాశాల కోసం ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.
శిల్పాశెట్టి
'బాజిగార్' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది శిల్పాశెట్టి. తొలినాళ్లలో ఆమె అందంపై అనేక ట్రోల్స్ వచ్చాయి. దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు సంపాదించిన నటి ప్రియాంక చోప్రా. ఆమె ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
అనుష్క శర్మ
'రబ్ నే బనాదీ జోడీ'లో షారుఖ్‌కు జంటగా నటించిన అనుష్కశర్మ.. తన అందమైన పెదాల కోసం సర్జరీ చేయించుకుందని సమాచారం. అయితే, కరణ్ జోహార్ టాక్ షోలో దీనిపై స్పందించిన అనుష్క.. అధునాతన మేకప్‌లతో, ఇంజెక్షన్ల ద్వారా మాత్రమే పెదవులకు అందాన్ని తెచ్చుకున్నట్టు తెలిపింది.
కంగనా రనౌత్
బాలీవుడ్ క్వీన్ కంగనా.. పెదవులకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆమె రొమ్ము ఇంప్లాంట్ సర్జరీనూ చేయించుకుంది. దాని తర్వాత ఆమెపై ప్రత్యేక ఆకర్షణ కోసం 2011లో విడుదలైన ఓ సినిమాలో బికినీపై దర్శనమిచ్చింది.
మనీషా లాంబా
బాలీవుడ్ నటి మినీషా లాంబా.. తన ముక్కు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సర్జరీ తర్వాత ఆమె రూపంలో అపురూపమైన మార్పు కనిపించింది.