తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాకూ 'హార్ట్​ బ్రేక్స్'​ ఉన్నాయి: వేదిక - వేదిక లవ్​ స్టోరీ

'విజయదశమి' సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన హీరోయిన్ వేదిక.. 'రూలర్​'లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఈ భామ.. ప్రేమ లేకపోతే జీవితమే లేదంటోంది. తన జీవితంలోనూ హార్ట్​ బ్రేక్స్​ ఉన్నాయని చెప్పింది.

heroine vaedika cute words about love
నాకూ హార్ట్​ బ్రేక్స్​ ఉన్నాయి: వేదిక

By

Published : Dec 29, 2019, 11:01 AM IST

Updated : Dec 29, 2019, 12:03 PM IST

చిన్ననాటి నుంచి డ్యాన్స్​, డ్రామానే ప్రపంచంగా పెరిగిన నటి వేదిక.. ప్రేమ లేకుంటే జీవితమే లేదని అంటోంది. అందరి జీవితాల్లోని ప్రేమకు తప్పక చోటుంటుందని, కొన్నిసార్లు 'హార్ట్​ బ్రేక్'​ అవుతుంటుందని చెబుతోంది. తన జీవితంలోనూ ప్రేమ వైఫల్యంతో పాటు కెరీర్​ పరంగా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నానందీ భామ.

" నా దృష్టిలో ప్రేమ లేకపోతే జీవితమే లేదు. అందరి జీవితాల్లోనూ ప్రేమకు చోటుంటుంది. 'హార్ట్​ బ్రేక్' కావడమూ ఉంటుంది. నా జీవితంలో రిలేషన్​షిప్​ పరంగానే కాకుండా, కెరీర్​ పరంగా 'హార్ట్​ బ్రేక్స్'​ ఉన్నాయి. వాటిని అధిగమించినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకో అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్​ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. కాబోయే వాడిలో నిజాయతీ, హాస్య చతురత తప్పనిసరిగా ఉండాలి" -వేదిక, హీరోయిన్

ఇటీవలే వచ్చిన 'రూలర్​' సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన మెరిసిందీ భామ. తన కెరీర్​లో 2006 నుంచి ఇప్పటివరకు 22 సినిమాల్లో నటించింది.

Last Updated : Dec 29, 2019, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details