తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరో ఎనర్జీ సూపర్: హీరోయిన్ వేదిక - బాలకృష్ణ రూలర్

'రూలర్​'లో హీరో బాలకృష్ణతో కలిసి నటించిన వేదిక.. ఈ కథానాయకుడి ఎనర్జీ సూపరంటూ ప్రశంసించింది. వచ్చే నెల 20న రానుందీ చిత్రం

హీరోయిన్ వేదిక

By

Published : Nov 22, 2019, 12:48 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'రూలర్​'. ఇందులో ఓ హీరోయిన్ వేదిక. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో అవకాశం దక్కించుకుంది. త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. సినిమా విశేషాల గురించి మాట్లాడింది. బాలకృష్ణతో కలిసి నటించడంపై ఆనందం వ్యక్తం చేసింది.

రూలర్​ సినిమాలో బాలకృష్ణతో హీరోయిన్ వేదిక

"బాలకృష్ణ.. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్​లో అందరితో కలిసిపోతారు. ఎనర్జీ సూపర్. ఆయనతో కలిసి డ్యాన్స్​ చేయడం నిజంగా అద్భుతం" -వేదిక, హీరోయిన్

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ మరో కథానాయికగా నటించింది. చిరంతన్ భట్ సంగీతమందించాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'రూలర్​' టీజర్​తో అదరగొట్టిన బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details