తెలంగాణ

telangana

ETV Bharat / sitara

#ఆస్క్ తమన్నా: క్రేజీ ప్రశ్నలు.. ఆసక్తికర సమాధానాలు - తమన్నా సమంత

#ఆస్క్ తమన్నా అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చింది హీరోయిన్ తమన్నా. ఇందులో పవన్, చిరంజీవి, సమంత గురించి చెప్పడం సహా ఎన్నో క్రేజీ విషయాల్ని పంచుకుంది.

#ఆస్క్ తమన్నా: క్రేజీ ప్రశ్నలు.. ఆసక్తికర సమాధానాలు
హీరోయిన్ తమన్నా

By

Published : Feb 22, 2020, 6:30 PM IST

Updated : Mar 2, 2020, 5:10 AM IST

తన అందం, అభినయంతో ఎందరో అభిమానుల మనసుల్ని దోచిన హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ చిత్రాలతోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఈరోజు సరదాగా ముచ్చటించింది. ఇందులో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలకు సమాధానం చెప్పింది.

  • మీరు ఇటీవల సత్యభామ కాలేజ్‌ ఫెస్ట్‌లో పాల్గొన్నారు కదా.. మీకెలా అనిపించింది?
  • తమన్నా: పదేళ్ల తర్వాత నేను అక్కడికి వెళ్లాను. నాకెంతో సంతోషంగా అనిపించింది.
    హీరోయిన్ తమన్నా
  • మీ దృష్టిలో ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది?
  • తమన్నా: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. విభిన్నమైన వ్యక్తులకు విభిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. నాకు మాత్రం నా కుటుంబం.. ఈ ప్రపంచంలోనే విలువైంది.
  • మంచి కథ? మంచి పాత్ర? ఏది ఎంచుకుంటారు?
  • తమన్నా: టీమ్‌ వర్క్‌తోనే సినిమాలు వస్తాయి. కాబట్టి మొదట నేను మంచి టీమ్‌ను చూస్తా. మంచి కథ, నన్ను ఆసక్తికి గురిచేసే పాత్ర కోసం చూస్తాను.
  • ఇన్‌స్టాలో 10 మిలియన్ల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా.. దాని గురించి ఒక కామెంట్‌?
  • తమన్నా: చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.
  • ఇటీవల మీరు టేబుల్‌ టెన్నిస్‌ అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదైనా పోటీల్లో పాల్గొని బహుమతి గెలుచుకున్నారా?
  • తమన్నా: నాకు ఆడడం అంటే ఇష్టం, అలవాటు. అంతేకానీ పోటీ పడడం కోసం ఆడను.
  • మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఒక విలువైన విషయం ఏంటి?
  • తమన్నా: మీరు ఏమైతే ఇస్తారో అదే మీకు వస్తుంది
  • 'డాంగ్‌ డాంగ్‌' సాంగ్‌ చేయడం ఎలా అనిపించింది?
  • తమన్నా: నాకెంతో ఇష్టమైన అనిల్‌ రావిపూడి, మహేశ్‌, దేవిశ్రీలతో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది.
    సరిలేరు నీకెవ్వరులోని డాంగ్ డాంగ్ పాటలో తమన్నా
  • మరోసారి సూర్యతో కలిసి నటించే అవకాశం వస్తే ఓకే చేస్తారా?
  • తమన్నా: సూర్యతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయడం ఓ కలలా ఉంటుంది.
  • మీ ఇంట్లోవాళ్లు ముద్దుగా ఏమని పిలుస్తారు?
  • తమన్నా: తమ్మూ
  • 'సీటీమార్‌' కోసం గోపీచంద్‌తో మొదటిసారి, అలాగే సంపత్‌నందితో మూడోసారి పనిచేయడం ఎలా ఉంది?
  • తమన్నా: ముచ్చటగా మూడోసారి సంపత్‌నందితో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే గోపీచంద్‌తో మొదటిసారి పనిచేయడం ఫన్‌.
  • మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఏ జోనర్‌ చిత్రాలను ఎంచుకుంటారు?
  • తమన్నా: కథానాయిక ప్రాధాన్యమున్న యాక్షన్‌, కామెడీ జోనర్‌ చిత్రాలు.
  • మీరు ఇప్పటిదాకా నటించిన సినిమాల్లో ఏది ఛాలెంజింగ్‌గా ఉంది?
  • తమన్నా: బాహుబలి.
    బాహుబలిలో తమన్నా
  • మీకు ఇష్టమైన ప్రదేశం?
  • తమన్నా: మా ఇల్లు
  • పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్కమాటలో చెప్పంటే?
  • తమన్నా: ఆయనో గొప్ప స్ఫూర్తి
    పవన్​కల్యాణ్​తో తమన్నా
  • నటనా రంగంలోకి వచ్చినప్పుడు మీ మొదటి ఆలోచన ఏమిటి?
  • తమన్నా: కెమెరా ఫేస్‌ చేయాలి. అలాగే రోజూ ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవాలి.
  • సమంత గురించి ఒక్కమాటలో..
  • తమన్నా: ఆమెతోపాటు ఆమె మనసూ అందంగా ఉంటుంది.
  • మీకు ఇష్టమైన ఫుడ్‌?
  • తమన్నా: పావ్‌ బాజీ
  • ఒకవేళ మీరు ఇంత ఫేమస్‌ కాకపోయి ఉంటే అప్పుడేం చేసేవారు?
  • తమన్నా: మీలాంటి ఎందరో అభిమానులతో ఛాటింగ్‌ చేసే అవకాశాన్ని మిస్‌ అయ్యేదాన్ని.
  • 'జోకర్‌' సినిమా చూశారా?
  • తమన్నా: చూడలేదు. కానీ తప్పకుండా చూడాలనుకుంటున్నాను.
  • 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మిమ్మల్ని ప్రశంసించడం ఎలా అనిపించింది?
  • తమన్నా: ఆయన గొప్ప వ్యక్తి. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన తగినంత గుర్తింపు ఇస్తారు.
    చరణ్, చిరంజీవిలతో తమన్నా
Last Updated : Mar 2, 2020, 5:10 AM IST

ABOUT THE AUTHOR

...view details