‘సాహో’ చిత్రంతో దక్షిణాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతోంది నటి శ్రద్ధా కపూర్. ఉత్తరాది, దక్షిణాదిలో ఒకేసారి విడుదలవుతుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది. కేవలం హీరో ప్రభాస్‌తో ఆడిపాడటమే కాకుండా పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట ఈ భామ.
సాహో సినిమాలోని యాక్షన్ సన్నివేశంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహోలో తన పాత్ర కోసం సెట్స్‌లో, జిమ్‌లో ఎంతో కష్టపడింది శ్రద్ధా. పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు శరీరం దృఢంగా ఉండటం ఎంతో అవసరం.
ఇందుకోసం ప్రతిరోజు దాదాపు 45 నిమిషాల పాటు కఠోర వ్యాయామాలు చేసేదట. డైట్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించేది శ్రద్ధా. యాక్షన్ సన్నివేశాల షూట్‌కు ముందురోజే తనకు ఎలాంటి డైట్ కావాలో ప్రొడక్షన్ వాళ్లకు చెప్పి సిద్ధం చేయించుకునేదట. మరొకరికైతే అలాంటి డైట్‌తో నీరసం రావడం ఖాయం... కానీ ఆ కొద్దిపాటి ఆహారంతోనే షూట్ మొత్తం చలాకీగా పూర్తి చేసేదట శ్రద్ధా కపూర్.
మరి ఇంత శ్రద్ధ పెట్టి చేసిన తన పాత్ర తెరపై ఎలా అలరిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ట్రెండింగ్‌లోనే కాదు.. వీక్షణలోనూ సాహోకు అగ్రస్థానమే