కెరీర్ ఎదుగుతున్న క్రమంలో తన నివాసంపై ఐటీ దాడులు జరగడం, ఆందోళనకు గురి చేసిందని చెప్పింది హీరోయిన్ రష్మిక. తక్షణమే షూటింగ్ ఆపేసి ఇంటికి వెళ్లినట్లు వివరించింది. ఈ విషయాన్ని 'భీష్మ' ప్రచారంలో భాగంగా వెల్లడించింది.
తన ఇంటిపై సోదాలు జరుగుతున్న సమయంలోనే 'భీష్మ' సినిమాలోని ఓ పాటలో ఈ పరిస్థితికి సంబంధించిన లిరిక్స్‌కు వచ్చాయని, అప్పుడు తను షాకయ్యానని రష్మిక చెప్పింది.