'టాక్సీవాలా' చిత్రం(taxiwala movie)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతపురం అమ్మాయి ప్రియాంకా జావల్కర్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఆమె కాస్త విరామం తర్వాత ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు'(thimmarusu movie), కిరణ్ అబ్బవరంతో కలిసి 'ఎస్‌ఆర్.కళ్యాణ మండపం'(kalyanamandapam movie)లో నటించింది. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం వల్ల ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిందామె.. అవేంటో ఆమె మాటల్లోనే..
భయపడ్డాను కానీ..
'తిమ్మరుసు'కు మొదటిరోజే మంచి స్పందన వచ్చింది. 'ఎస్‌ఆర్.కళ్యాణమండపం' విడుదల రోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత మంచి ఆదరణ వస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ బాగానే ఉంటోంది. కలక్షన్స్ కూడా వస్తున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్ తర్వాత దాదాపు ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడం గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన గ్యాప్ గురించి కూడా ప్రస్తావించాలి. 2019లో ఒక సినిమా చేశాను. 2020లో 'తిమ్మరుసు'తో పాటు 'ఎస్‌ఆర్.కళ్యాణ మండపం' చేశాను. గతేడాది ఆగస్టులోనే 'ఎస్‌ఆర్.కళ్యాణమండంపం' విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల ఆలసమ్యమైంది. ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల కావడం వల్ల కొంచెం టెన్షన్ పడ్డాను. అసలు ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా..? అంత ధైర్యం చేస్తారా.? అనే అనుమానం ఉండేది. వారం రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. కానీ.. నా భయం నిజం కాలేదు. రెండు సినిమాలనూ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
బొద్దుగా ఉన్నానని..
తిమ్మరుసు సినిమాలో బొద్దుగా ఉన్నానంటూ చాలామంది కామెంట్లు చేశారు. శరీరాకృతి, కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నా కెరీర్‌పై నాకంటే ఎక్కువ జాగ్రత్తలు ఎవరూ తీసుకోలేరు. నేనే కాదు ప్రతి ఒక్క మనిషి తన ఆరోగ్యం, భవిష్యత్తు గురించి తానే జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నాలో మార్పులు వచ్చాయి. వాటితో నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. డాక్టర్లను సంప్రదిస్తే.. థైరాయిడ్ అని చెప్పారు. ఆ కారణంగానే బరువు పెరిగాను. ఆ తర్వాత జిమ్‌లో వర్కౌట్‌లు చేసి మళ్లీ బరువు తగ్గాను. అయితే.. నా కెరీర్ విషయంలో అజాగ్రత్తగా లేనని చెప్పేందుకే ఆ రోజు వేదిక మీద 'నేను మోడల్‌ను కాదు.. నటిని' అని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే.. నిజ జీవితంలో ఉన్నదాని కంటే మన శరీరం కెమెరాలో 30శాతం భారీగా కనిపిస్తుంది. ఉన్నదున్నట్టుగా కనిపించాలంటే మనం సన్నగా ఉండాలి.
గ్యాప్ ఎందుకంటే..