దక్షిణాది కథానాయికల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న నటి నయనతార. ఈ ఏడాది ఆరంభంలో 'దర్బార్' చిత్రంతో మెరిసింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లిల్లీగా అలరించింది. తాజాగా ఓ ప్రముఖ ప్రతికకు తన గతకాలపు బంధాల గురించే చెబుతూ.. "నమ్మకం, ప్రేమ ఈ రెండులేని చోట ఏ బంధమూ సరిగా నిలబడదు. అలాంటప్పుడు కలిసి ఉండడం కంటే వేరుగా, ఒంటరిగా ఉండటమే ఉత్తమమని గ్రహించాన"ని చెప్పింది.
'నమ్మకం, ప్రేమ లేని చోట ఏ బంధమూ నిలవదు' - nayantara interviews
దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార తన గతకాలపు బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నమ్మకం, ప్రేమ ఈ రెండులేని చోట ఏ బంధమూ నిలబడదని తాను గ్రహించినట్లు వెల్లడించింది.
సుదీర్ఘంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న నయనతార తొలుత తమిళ హీరో శింబుతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. అనంతరం నృత్యదర్శకుడు, డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పెళ్లి పీటల వరకు వెళ్లిన వీరు తర్వాత విడిపోయారు. ఇలాంటి ఎన్నో అనుబంధాల ఆటుపోట్లను ఎదుర్కొని కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉంది నయన్. తరువాత మళ్లీ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.
ఇదీ చూడండి : పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ భామకు వరుడు కావలెను